స్మితా సబర్వాల్ వైరల్
సర్కార్ మారినా సూపర్
హైదరాబాద్ – తెలంగాణకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లలో మోస్ట్ పాపులర్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చేది మాత్రం స్మితా సబర్వాల్. గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. అంతే కాదు ఆమె ఏది చెబితే ఆ పని అయి పోయేదన్న ప్రచారం జరిగింది. సీఎంఓ ఆఫీసులో కీలకంగా ఉన్నారనే టాక్ కూడ కొనసాగింది.
ఊహించని రీతిలో రాష్ట్రంలో ప్రభుత్వం మారి పోయింది. మరోసారి పవర్ లోకి వస్తానని అనుకున్న కేసీఆర్ ఓటమి పాలయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో ఆనాటి సర్కార్ లో వంత పాడిన ఆఫీసర్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. చాలా మందికి స్థాన చలనం కలిగింది కూడా.
ఇదే సమయంలో కేసీఆర్ ఇలాఖాలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన స్మితా సబర్వాల్ పై వేటు పడింది. ఆమెకు అప్రధాన్యత పోస్టు ను కేటాయించారని విమర్శలు కూడా వచ్చాయి. కానీ తను ఎక్కడ ఉన్నా ఇబ్బంది ఏమీ లేదంటూ ప్రూవ్ చేసుకున్నారు స్మితా సబర్వాల్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకో ఫోటో షేర్ చేస్తూ సాగుతున్నారు . ఏది ఏమైనా తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.