NEWSTELANGANA

స్మిత‌మ్మ చ‌ల్లంగ బ‌తుక‌మ్మ

Share it with your family & friends

పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ – సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్, రాష్ట్ర తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా ప‌లువురు ఆమెకు బ‌ర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు. స్మితా 19 జూన్ 1977లో పుట్టారు. స‌బ‌ర్వాల్ కు 46 ఏళ్లు.

త‌న భ‌ర్త పేరు పొందిన సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ అకున్ స‌బ‌ర్వాల్. వీరికి పిల్ల‌లు కూడా ఉన్నారు. తండ్రి క‌ల్న‌ల్ ప్ర‌ణ‌బ్ దాస్ , త‌ల్లి పురాబి బెన‌ర్జీ. తెలంగాణ ఐఏఎస్ కేడ‌ర్ 2001 కి చెందిన బ్యాచ్ స్మితా స‌బ‌ర్వాల్ ది. ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటూ పేరు పొందారు. ఆమెను అంతా పీపుల్స్ ఆఫీస‌ర్ గా పిలుచుకుంటారు.

గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ఆఫీస‌ర్ గా పేరొందారు. ప్ర‌భుత్వం మార‌డంతో స్మితా స‌బ‌ర్వాల్ బ‌దిలీ చేయ‌బ‌డ్డారు. సీఎంఓ ఆఫీసులో ఎంపికైన తొలి మ‌హిళా అధికారిగా ఉన్నారు. సీఎం కార్య‌ద‌ర్శిగా , గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, ప‌రిశుధ్య విభాగం బాధ్య‌త‌లు చేప‌ట్టారు గ‌తంలో.

సబర్వాల్ తన పాఠశాల విద్యను సెయింట్ ఆన్స్ హై స్కూల్, సికింద్రాబాద్‌లో చదివారు. వాణిజ్య శాస్త్రంలో టాప‌ర్ గా ఉన్నారు. 2000లో యూపీఎస్సీ లో ఉత్తీర్ణ‌త సాధించారు. ఇండియా మొత్తంలో 4వ ర్యాంక్ సాధించారు. ఆమె అప్పుడు వ‌య‌సు కేవ‌లం 22 ఏళ్లు మాత్ర‌మే.