ఆర్థిక పరిస్థితిపై స్మిత ఫోకస్
జిల్లాల వారీగా సమావేశాల ఏర్పాటు
హైదరాబాద్ – వికలాంగుల పట్ల తీవ్రమైన వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఎక్కడా తగ్గడం లేదు. పాలనా పరంగా మరింత దూకుడు పెంచారు.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కీలకంగా వ్యవహరించారు. ఈ మేరకు పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో స్మితా సబర్వాల్ పర్యటించాలని నిర్ణయించారు.
ఈ మేరకు తొలి కీలక సమావేశం తాను గతంలో జిల్లా కలెక్టర్ గా ఉన్న కరీంనగర్ జిల్లాలో చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు స్మితా సబర్వాల్. ఈ కీలక సమావేశంలో జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. సలహాలు, సూచనలు అందజేశారు.