పుస్తకాలు లేకుండా నేనుండ లేను
స్మితా సబర్వాల్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ – ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. మంగళవారం ఆమె ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తాను పుస్తకాలు చదవకుండా ఉండలేనని పేర్కొన్నారు. పుస్తకాలు మనలోని మాలిన్యాన్ని తొలగించేలా చేస్తాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు పుస్తకాలను చదవడం అలవాటుగా మార్చు కోవాలని సూచించారు.
ఈ సందర్బంగా కల్పన గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. కల్పన అనేది అబద్ధం లోపల నిజం అని పేర్కొన్నారు. పుస్తకాలు చదవడం వల్ల అంతులేని ఆత్మ విశ్వాసం నెలకొంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు స్మితా సబర్వాల్.
జీవితంలో దేనినైనా పొందాలన్నా, విజయం సాధించాలంటే పుస్తకాలను మించిన ఆధారం ఏదీ ఈ లోకంలో లేదన్నారు. ప్రజలలో మరింత అవగాహన కల్పించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మానవ సమాజాన్ని సుసంపన్నం చేసేందుకు ఓ బహుమతిగా తాను భావిస్తానని స్పష్టం చేశారు.