NEWSTELANGANA

విద్య‌పై యువ‌త ఫోక‌స్ పెట్టాలి

Share it with your family & friends

స్మితా స‌బ‌ర్వాల్ కీల‌క వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ – సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కోల్ క‌తా లోని అకాడ‌మీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కు చెందిన ప్ర‌ముఖ క‌ళాకారిణి చైతాలీ మంచి పెయింటర్ గా పేరు పొందారు. స్మితా స‌బ‌ర్వాల్ అంటే విప‌రీత‌మైన ఇష్టం. ముందు నుంచి స్మిత‌ను ఆద‌ర్శంగా తీసుకుంది. ఈ మేర‌కు అద్భుత‌మైన చిత్రం గీసింది.

సివిల్ స‌ర్వీసెస్ లో కెరీర్ చేసేందుకు ఫోక‌స్ పెట్ట‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. చైతాలీతో పాటు మ‌రికొంద‌రు యువ‌తులు స్వ‌యంగా స్మితా స‌బ‌ర్వాల్ ను క‌లుసుకున్నారు. వారికి ప‌లు సూచ‌న‌లు , స‌ల‌హాలు అంద‌జేశారు.

ఇదిలా ఉండ‌గా స్మితా స‌బ‌ర్వాల్ ఇప్పుడు వైర‌ల్ గా మారారు. ఆమెపై ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కొత్త స‌ర్కార్ వ‌చ్చాక ఆమెను అప్ర‌ధాన్య పోస్టుకు బ‌దిలీ చేసింది. గ‌తంలో కొలువు తీరిన కేసీఆర్ పాల‌న‌లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు . దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. ఇదిలా ఉండ‌గా దేశ భ‌విష్య‌త్తు యువ‌త‌పైనే ఉంద‌ని , చ‌దువుపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు.

.