ఓటు ప్రజా చైతన్యానికి ప్రతీక
ఓటేసిన స్మితా సబర్వాల్
హైదరాబాద్ – ఓటు అన్నది ప్రజా చైతన్యానికి ప్రతీక అని, అందుకే ప్రతి ఒక్కరు ఓటు వేయడం అలవాటుగా మార్చు కోవాలని స్పష్టం చేశారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఆమె సోమవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దేశ వ్యాప్తంగా తను సంచలనంగా మారారు జిల్లా కలెక్టర్ గా పని చేసిన సమయంలో. ప్రజలను ఓటు వేసేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రజల మనిషిగా పేరు పొందారు. సమస్యలను పరిష్కరించడంలోనే కాకుండా వారి కష్టాలను పట్టించుకునే అధికారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైన కుటుంబాల తల్లులను ఆదరించారు. వారిని సన్మానించారు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున ఓటు ప్రాధాన్యత గురించి ప్రచారం చేపట్టారు. ప్రతి ఒక్కరు తమంతకు తాముగా ఓటు వేసేలా చేశారు.
ఇవాళ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్మితా సబర్వాల్. నేను ఓటు వేశాను. ఇది నా బాధ్యత. మీరు కూడా ఓటు వేశారని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.