ఆత్మ గౌరవాన్ని కోల్పోవద్దు
సీనియర్ ఆఫీసర్ స్మితా సబర్వాల్
హైదరాబాద్ – సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ , తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలు పోషిస్తున్న పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. అన్ని రంగాలలో మహిళలు ఇవాళ కీలకమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ఇవాళ నేల నుంచి నింగి దాకా ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర పోషిస్తూ దూసుకు వెళుతున్నారని స్పష్టం చేశారు స్మితా సబర్వాల్. దేశాన్ని నిర్మించడంలో, అభివృద్ది సాధించడంలో తల్లులు ఆదర్శ ప్రాయంగా మారుతున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా మీరు ఎప్పటికీ ఎవరినీ ఆశించ వద్దని కోరారు. సర్వ లోకాలను సమతుల్యం చేసేందుకు దేవుడు మనల్ని సృష్టించాడని తెలిపారు స్మితా సబర్వాల్.
ఏడాదికి ఒకసారి దినోత్సవం నిర్వహించడం ఎందుకు. ప్రతి రోజూ మహిళలదేనని స్పష్టం చేశారు. పిల్లలను తీర్చి దిద్దే బాధ్యత పేరెంట్స్ పై ఉంటుందన్నారు. ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న వారిలో ముఖ్యంగా బాధ్యతతో కూడుకున్న వారిలో మహిళలేనన్న సంగతి మరిచి పోకూడదని పేర్కొన్నారు స్మితా సబర్వాల్.