బోనాల ఉత్సవం ‘స్మిత’ సంతోషం
తెలంగాణ సంస్కృతికి ప్రతీక
హైదరాబాద్ – తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వైరల్ గా మారారు. ఆమె ఏది మాట్లాడినా, ఏది చేసినా క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నారు. స్మితా సబర్వాల్ హైదరాబాద్ లో చదువుకున్నారు. ఇక్కడి నుంచే సివిల్స్ కు హాజరయ్యారు. అతి తక్కువ వయసులో సివిల్స్ ఎంపికై విస్తు పోయేలా చేశారు.
వృత్తి రీత్యాల పలు పదవులు నిర్వహించారు. ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంవోలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆమె ప్రాధాన్యత కొంత తగ్గింది. అయినా ఎక్కడా తగ్గడం లేదు స్మితా సబర్వాల్. తాను అనుకున్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం అలవాటు. ముందు నుంచీ ఎవరికీ భయపడే రకం కాదు.
తాజాగా స్మితా సబర్వాల్ వికలాంగుల పట్ల చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసేంత దాకా వెళ్లాయి. అయినా తగ్గలేదు. మరింత దూకుడు పెంచారు. స్వరం వణికినా నిజమే మాట్లాడాలంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా తెలంగాణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం స్మితా సబర్వాల్ ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. బోణం సంస్కృతీ సంప్రదాయాలకు నెలవంటూ పేర్కొన్నారు.