NEWSTELANGANA

యువ‌త కీల‌కం భ‌విష్య‌త్తు అద్భుతం

Share it with your family & friends

పిలుపునిచ్చిన స్మితా స‌బ‌ర్వాల్

హైద‌రాబాద్ – ఈ దేశానికి యువ‌త అత్యంత చోద‌క శ‌క్తిగా మార‌నుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్. ఆమె సోమ‌వారం విద్యార్థినీ విద్యార్థులు, యువ‌తీ యువ‌కులతో ముఖా ముఖి అయ్యారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యువ‌త త‌లుచుకుంటే సాధించ‌న‌ది అంటూ ఏదీ లేద‌న్నారు. వాళ్లు ఈ దేశ భ‌విష్య‌త్తుకు పునాది రాళ్లు అంటూ కితాబు ఇచ్చారు.

నిప్పు రవ్వల‌ను వెలిగించండి, శక్తిని విప్పండి, యువత బాధ్యతలు స్వీకరించండి, నైపుణ్యాలతో వెలిగి పోవ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు స్మితా స‌బ‌ర్వాల్. గ‌త 20 ఏళ్ల కింద‌ట ఇప్పుడు ఉన్న‌న్ని అవ‌కాశాలు, వ‌న‌రులు లేవ‌న్నారు.

కానీ యావ‌త్ ప్ర‌పంచం టెక్నాల‌జీ రాక‌తో చిన్న‌దై పోయింద‌న్నారు. సోష‌ల్ మీడియా, డిజిటల్ మాధ్య‌మం ప్ర‌పంచాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాయ‌ని, వాటిని గుర్తించి అందులో ప్రావీణ్యం సంపాదిస్తే బ‌త‌క‌డం , స‌క్సెస్ సాధించ‌డం గొప్ప విష‌యం కాద‌న్నారు స్మితా స‌బ‌ర్వాల్.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌ధానంగా యువ‌త శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయ‌ని ఇంకా చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు.