ఎన్నికల ఏర్పాట్లపై స్మితా ఆరా
మహారాష్ట్రలో పరిశీలకురాలిగా
మహారాష్ట్ర – తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలలో భాగంగా రెండు శాసన సభ నియోజకవర్గాలకు పరిశీలకురాలిగా నియమితులయ్యారు. దీంతో ఇప్పటికే ఆమె రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి బుందేల్ రెండోది మల్కాపూర్.
ఈ రెండు నియోజకవర్గాలకు స్మితా సబర్వాల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలన అధికారిణిగా నియమించింది. త్వరలోనే శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలను ఓటు వేసే విధంగా చైతన్యవంతం చేస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ సారించారు.
ఎక్కడా లోటు పాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందితో సమీక్ష చేపట్టారు. అంతే కాకుండా జిల్లా కలెక్టర్ తో రివ్యూ చేశారు. ఓటర్ల జాబితాలను పరిశీలించారు. ఎవరికైనా ఓటు రాక పోతే వెంటనే తమకు తెలియ చేయాల్సిందిగా ఆదేశించారు.
కొత్తగా ఓటర్లు కాని వారుంటే వెంటనే తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు స్మితా సబర్వాల్.