స్మితం హితం పురస్కారం
టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డ్స్
హైదరాబాద్ – ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలో ఉన్న వారిని, తమ తమ స్థాయిలలో విజేతలుగా నిలిచిన వారిని గుర్తించి అవార్డులను అందజేసింది.
ప్రధానంగా దేశంలోనే మోస్ట్ పాపులర్ ఐఏఎస్ ఆఫీసర్ గా గుర్తింపు పొందిన స్మితా సబర్వాల్ తో పాటు ప్రముఖ గాయని మంగ్లీ, తదితర మహిళా మణులకు పురస్కారాలను అందజేసింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు స్మితా సబర్వాల్.
గతంలో కంటే ఇప్పుడు మరింత ముందంజలో మహిళలు కొనసాగుతున్నారని తెలిపారు. ప్రతి రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. తాజాగా జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో సైతం యువత ఎక్కువగా ర్యాంకులు సాధించడం తనకు సంతోషం కలిగించిందన్నారు.
ఏది సాధించాలన్నా ముందు లక్ష్యం గొప్పదిగా ఉండాలని, ఆదిశగా ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుందన్నారు స్మితా సబర్వాల్. తనకు అవార్డు అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు .