పర్యాటక రంగం అభవృద్దిపై ఫోకస్
స్పష్టం చేసిన కార్యదర్శి స్మితా సబర్వాల్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కీలకమైన పోస్టులో కొలువు తీరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత ముఖ్యమైన అధికారిణిగా గుర్తింపు పొందారు. కొద్ది కాలంలోనే దేశ వ్యాప్తంగా పేరు పొందారు. సీఎంఓలో ముఖ్య భూమిక పోషించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లను అందించేందుకు ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారింది. దాని స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో గత సర్కార్ హయాంలో ఒక వెలుగు వెలిగిన స్మితా సబర్వాల్ ను అప్రధాన్య పోస్టులో కేటాయించారన్న విమర్శలు వచ్చాయి. ఆమెను ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించారు. ఇదే సమయంలో వికలాంగులకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా స్మితా సబర్వాల్ చర్చనీయాంశంగా మారారు.
ఈ తరుణంలో ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుండి మనసు మార్చుకుంది. స్మితా సబర్వాల్ కు కీలకమైన పదవిని కట్టబెట్టింది. ప్రధానంగా యూత్ లో ఆమెకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని యువజన అభివృద్ది, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శిగా నియమించింది. ఈ సందర్బంగా ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. మామిడి హరికృష్ణ స్మితా సబర్వాల్ కు పుస్తకాలను బహుమతిగా అందజేశారు.