NEWSTELANGANA

కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి థ్యాంక్స్

Share it with your family & friends

స్మితా స‌బ‌ర్వాల్ కీల‌క వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి, ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఆమెకు అరుదైన అవ‌కాశం ఇచ్చింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. మ‌హారాష్ట్ర‌లో ఎన్నిక‌లు ముగిశాయి.

ఈ సంద‌ర్బంగా స్మితా స‌బ‌ర్వాల్ కు రెండు శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌ల అధికారిగా నియ‌మించింది. రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించి ఎన్నిక‌ల పోలింగ్ ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు స్మితా స‌బర్వాల్.

ఫోటోల‌ను పంచుకున్నారు. త‌న‌తో పాటు ఇత‌ర సిబ్బంది స‌హాయ స‌హ‌కారాలు అందించార‌ని, ప్ర‌త్యేకించి ఓటు విలువ గురించి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. తెల్ల‌వారుజామున కూడా ప‌ని చేశార‌ని , వారి సేవ‌ల‌ను తాను మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు స్మితా స‌బ‌ర్వాల్.

అవ‌కాశం ఇచ్చినందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి, ఎన్నిక‌ల సిబ్బందికి, రాష్ట్ర స‌ర్కార్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు సీనియ‌ర్ అధికారిణి.