స్మితం ప్రజా హితం
వైరల్ గా మారిన సబర్వాల్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్మితా సబర్వాల్ మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఆమె నిత్యం వార్తల్లో ఉంటారు. ప్రతి రోజూ ఏదో ఒక అంశంతో ముందుకు వస్తారు. మోటివేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఎవరి జీవితం వారే బతకాలని కోరుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇండ్యూవాలిటీని ఎక్కువగా ఇష్ట పడతారు. అంతే కాదు ఆమె ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారి పోతారు.
పిన్న వయసులోనే యూపీఎస్సీకి ఎంపికయ్యారు. కరీంనగర్, మెదక్ జిల్లాల కలెక్టర్ గా పని చేసిన సమయంలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆ తర్వాత ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గత సర్కార్ లో కీలకమైన అధికారిణిగా పేరు పొందారు.
కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరడంతో స్మితా సబర్వాల్ ను అప్రధాన్య పోస్టుకు ఎంపిక చేశారన్న విమర్శలు లేక పోలేదు. వాటన్నింటిని పక్కన పెట్టారు ఆమె. నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. మొత్తంగా వైరల్ గా మారి పోయారు . తాజాగా ఆమె చేసిన పోస్ట్ హల్ చల్ చేస్తోంది.