ట్విట్టర్ వేదికగా హల్ చల్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వైరల్ గా మారారు. ఆమె బీఆర్ఎస్ సర్కార్ లో కీలకంగా వ్యవహరించారు. అన్నీ తానై గుర్తింపు పొందారు. కానీ ఊహించని రీతిలో ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. దీంతో పలువురు ఉన్నతాధికారులకు స్థాన చలనం కలిగింది.
కేసీఆర్ హయాంలో ఒక వెలుగు వెలిగిన స్మితా సబర్వాల్ కు ఊహించని షాక్ తగిలింది. ఆమెకు అప్రధాన్య పోస్టు ఖరారు చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసు లోకి వెళుతుందని ప్రచారం జరిగింది.
కానీ వాటిని పటాపంచలు చేస్తూ తను ఎక్కడికీ వెళ్లనంటూ ప్రకటించింది స్మితా సబర్వాల్. రాష్ట్రాన్ని విడిచి ఎక్కడికీ వెళ్లేది లేదంటూ ప్రకటించింది. ప్రస్తుతం ఇతర ఉన్నతాధికారుల కంటే తను సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా స్మితా సబర్వాల్ షేర్ చేసిన ఫోటో హల్ చల్ చేస్తోంది.