స్మితా సబర్వాల్ వైరల్
సోషల్ మీడియాలో హల్ చల్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి సంచలనంగా మారారు. ఆమె ఏది చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతి రోజూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన అభిప్రాయాలను పంచుకుంటుంది. ప్రత్యేకించి మోటివేషన్ కు సంబంధించి కీలకమైన సూచనలు చేస్తూ ఉంటుంది.
తను అత్యంత పిన్న వయసు లోనే ప్రతిష్టాత్మకమైన సివిల్స్ కు ఎంపికైంది. పలు ప్రాంతాలలో పని చేసింది. సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ కాలంలో అమరుల త్యాగాలను గుర్తించింది. తల్లులను సత్కరించింది. వారిని అక్కున చేర్చుకుంది. ఇదే ఆమెను ప్రత్యేకమైన ప్రజల ఆఫీసర్ గా పేరు తెచ్చుకునేలా చేసింది.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో కీలకమైన పదవిలో ఉన్నారు. అనూహ్యంగా సర్కార్ మారడంతో తనను పక్కన పెట్టారు. అయినా ఎక్కడా తగ్గడం లేదు స్మితా సబర్వాల్. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో దేవత లాగా ఉందని పలువురు కామెంట్స్ చేయడం విశేషం.