NEWSTELANGANA

కాకా ఆశీర్వాదం స్మితా సంతోషం

Share it with your family & friends

మ‌రాఠాలో అరుదైన స‌న్నివేశం

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ స్మితా స‌బ‌ర్వాల్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆమె మోస్ట్ పాపుల‌ర్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు. అంద‌రికంటే ఎక్కువ‌గా ఆమె సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. త‌న అభిప్రాయాల‌ను , ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటారు. త‌న‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి కూడా ప్ర‌స్తావిస్తుంటారు.

ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్మితా స‌బ‌ర్వాల్ కు కీల‌క‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మ‌రాఠాలోని రెండు శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఆమెను ఎన్నిక‌ల అధికారిగా నియ‌మించింది.

తాజాగా అరుదైన స‌న్నివేశం త‌న‌ను ఆక‌ట్టుకుంద‌ని తెలిపింది స్మితా స‌బ‌ర్వాల్. ఎన్నిక‌ల ప‌రిశీల‌న నిమిత్తం వెళుతుండ‌గా ఓ వృద్దుడు త‌న‌ను ఆపి త‌న‌కు ఆశీర్వాదం అందజేశార‌ని, ఇది త‌న జీవితంలో మ‌రిచి పోలేని సంఘ‌ట‌న‌గా పేర్కొన్నారు స్మితా స‌బ‌ర్వాల్. ఇదిలా ఉండ‌గా మ‌రాఠాలో పెద్ద వారిని కాకా అని అంటార‌ని, అందుకే కాకాను త‌ను ఎల్ల‌ప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటాన‌ని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.