NEWSTELANGANA

ముగిసిన స్మిత..సోమేష్ విచారణ

Share it with your family & friends

మాజీ సీఎస్ పై తీవ్ర ఆగ్ర‌హం

హైద‌రాబాద్ – కాళేశ్వ‌రం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి, అక్ర‌మాల‌పై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వ‌రం క‌మిష‌న్ చీఫ్ జ‌స్టిస్ చంద్ర‌ఘోష్ గురువారం విచార‌ణ చేప‌ట్టారు. ఇప్ప‌టికే త‌మ ముందుకు విచార‌ణ కోసం హాజ‌రు కావాల‌ని నోటీసులు జారీ చేసింది క‌మిష‌న్. వీరిలో గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో సీఎంఓలో కీల‌క పాత్ర పోషించిన ప్ర‌స్తుత తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ తో పాటు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ లు ఉన్నారు.

తాజాగా ఈ ఇద్ద‌రు క‌మిష‌న్ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా కాళేశ్వ‌రం క‌మిష‌న్ చీఫ్ కీల‌క ప్ర‌శ్న‌లు సంధించారు తొలుత స్మితా స‌బ‌ర్వాల్ ను ఉద్దేశించి. కేబినెట్ ఆమోదం లేకుండానే మూడు బ్యారేజీలకు చెందిన పరిపాలన అనుమతులు పొందాయా, కొన్ని ఫైల్స్ సీఎంఓకి చేరకుండానే అనుమతులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు.

కాగా కాళేశ్వ‌రం కమిషన్ అడిగిన ప్రశ్నలకు తెలియదు, అవగాహన లేదంటూ స‌మాధానం ఇచ్చారు. ప్ర‌మాణం చేయించారు చీఫ్ ఆమెతో. కాగా అంత‌కు ముందు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బహిరంగ విచారణ కోసం కోర్టు హాల్లోకి పిలిచిన వెంటనే రాక పోవడంతో కమిషన్ చీఫ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *