ప్రతిభావంతులకు స్మిత పిలుపు
ఆర్థిక శాఖ కొత్త ప్రయోగానికి శ్రీకారం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె మోస్ట్ పవర్ ఫుల్ సిన్సియర్ అధికారిణిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. నిత్యం నూతన విధానాలతో, ఆలోచనలతో ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేందుకు ఇష్ట పడతారు.
ఇదే సమయంలో తను సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వివిధ రంగాలలో ప్రతిభ కలిగిన యంగ్ టర్క్స్ ను గుర్తించే పనిలో పడ్డారు. ప్రధానంగా ఆర్థిక శాఖకు సంబంధించి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చే యువతను ప్రోత్సహించేందుకు కంకణం కట్టుకున్నారు.
ప్రస్తుతం డిమాండ్ ఉన్న వాటిలో అత్యధికంగా ట్యాక్సేషన్ , ఫిస్కల్ పాలసీ, రూరల్ డెవలప్ మెంట్ , బిజినెస్ మేనేజ్ మెంట్ , పబ్లిక్ పాలసీ , ఫిన్ టెక్ కు సంబంధించిన విషయాలలో పరిజ్ఞానం ఉన్నవారికి సాదర స్వాగతం పలుకుతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ మేరకు టీఎస్ఎఫ్సీ పాలు పంచుకోవాలని అనుకుంటోందని పేర్కొన్నారు స్వయంగా స్మితా సబర్వాల్ . సోమవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయం పంచుకున్నారు. ఆసక్తి ఉన్న వారు 9391869123 అనే నెంబర్ కు ఫోన్ చేసి తమ వివరాలు అందజేయాలని కోరారు స్మితా సబర్వాల్.