NEWSTELANGANA

ఫైనాన్స్ క‌మిష‌న్ కీల‌క స‌మావేశం

Share it with your family & friends

ప‌లు సూచ‌న‌లు స్వీక‌రించిన స్మితా

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ‌, క‌మిష‌న్ ముఖ్య కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ పాల‌నా ప‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి విస్తృతంగా చ‌ర్చిస్తున్నారు. మెరుగైన ఆర్థిక వ‌న‌రుల వినియోగం, నూత‌న ఆలోచ‌న‌లు, సూచ‌న‌ల‌ను అనుభ‌వ‌జ్ఞులు, ఉన్న‌తాధికారులు, మేధావుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చిస్తూ స్వీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఓ ప్ర‌త్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక క‌మిష‌న్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో మెప్మా, సెర్ప్ సంస్థ‌ల ఉన్న‌తాధికారుల‌తో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ స‌మావేశం అద్భుతంగా జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు స్మితా స‌బ‌ర్వాల్. ఆమె ఎక్స్ వేదిక‌గా ఈ విష‌యాన్ని పంచుకున్నారు.

తాను ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి గా బాధ్య‌త‌లు చేప‌ట్టాక కీల‌క‌మైన మార్పులు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు సీనియ‌ర్ ఆఫీస‌ర్. మెరుగైన పాల‌న అభివృద్ది కోసం కీల‌క‌మైన సూచ‌న‌లు చేశార‌ని, ఈ సంద‌ర్బంగా పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రినీ అభినందిస్తున్న‌ట్లు తెలిపారు స్మితా స‌బ‌ర్వాల్.

సెర్ప్ సీఈవో గౌత‌మ్ తో పాటు ఇత‌ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఎవ‌రైనా స‌రే మెరుగైన ఆర్థిక ప్ర‌గ‌తి కోసం సూచ‌న‌లు చేయొచ్చ‌ని, స‌లాహాలు ఇవ్వ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు .