స్మృతీ ఇరానీకి షాక్ శర్మ విక్టరీ
ప్రతీకారం తీర్చకున్న కాంగ్రెస్
ఉత్తర ప్రదేశ్ – కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి కోలుకోలేని షాక్ తగిలింది. తాజాగా వెల్లడైన ఫలితాలలో ఆమెకు ఊహించని రీతిలో పరాజయం దక్కింది. మరో వైపు నిన్నటి దాకా మోడీ జపం చేసిన వారందరీకి యూపీలో ఆశించిన స్థాయిలో ఆదరణ లభించ లేదు.
ఒకానొక దశలో 6 వేలకు పైగా ఓట్లతో సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గంలో అజయ్ రాయ్ చేతిలో వెనుకంజ ఉన్నారు. ఆ తర్వాత దూసుకు వచ్చారు. ఇది పక్కన పెడితే ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని అనరాని మాటలు అన్నారు స్మృతీ ఇరానీ.
విచిత్రం ఏమిటంటే రాహుల్ గాంధీ ఈసారి రెండు నియోజకవర్గాలలో పోటీ చేశారు. వాయనాడులో , రాయ్ బరేలీలో భారీ విజయాన్ని కట్టబెట్టారు ఓటర్లు. ఇది మోడీకి మరో రకంగా దెబ్బ . భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు మాటేమో కానీ 290 సీట్లకే పరిమితం కావడం ఒకింత ఆశ్చర్య పోయేలా చేసింది.
ఇక కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కిషోరి లాల్ శర్మ ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా శర్మను ప్రత్యేకంగా అభినందించారు ప్రియాంక గాంధీ.