NEWSNATIONAL

కిర‌ణ్ రిజిజుకు స్మృతీ ఇరానీ కంగ్రాట్స్

Share it with your family & friends

పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి
న్యూఢిల్లీ – కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ సంచ‌ల‌నంగా మారారు. ఆమె తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి శ‌ర్మ చేతిలో అమేథి నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌మి పాల‌య్యారు. కేంద్ర మంత్రిగా గ‌త ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కానీ అనూహ్యంగా ప‌రాజ‌యం పొంద‌డంతో తాజాగా మోడీ ప్ర‌క‌టించిన 72 మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌లేదు.

అయితే గ‌త కొన్నేళ్లుగా భార‌తీయ జ‌నతా పార్టీలో కీల‌కంగా ఉన్నారు. మోడీ ప‌రివారంలో స‌భ్యురాలిగా గుర్తింపు పొందారు. ఒక‌ప్పుడు న‌టిగా ప‌ని చేశారు . అనంత‌రం కాషాయ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు.

పార్లమెంట్ లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అనుచిత కామెంట్స్ చేశారు. అప్ప‌ట్లో వివాదాస్ప‌ద నాయ‌కురాలిగా పేరొందారు. తాజాగా త‌న ఇంటికి వ‌చ్చిన పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా నియ‌మితులైన కిర‌ణ్ రిజిజుకు స్వీట్స్ తినిపించారు స్మృతీ ఇరానీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.