ఓడినా ప్రజల మధ్యే ఉంటా
స్పష్టం చేసిన స్మృతీ ఇరానీ
ఉత్తర ప్రదేశ్ – లోక్ సభ ఎన్నికలలో అమేథీ నియోజకవర్గంలో ఓడి పోయారు భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. ఆమె ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నానని అన్నారు. ఎవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా ఓటమి లేదా గెలుపును ఒప్పుకుని తీరాల్సిందేనని స్పష్టం చేశారు స్మృతీ ఇరానీ. ఇక తన కోసం ముందు నుంచీ పని చేసిన కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.
గత 30 ఏళ్లలో పెండింగ్ లో ఉన్న పనులను కేవలం 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయడం జరిగిందని చెప్పారు స్మృతీ ఇరానీ. తనకు టికెట్ ఇచ్చినందుకు , ప్రోత్సహించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటానని పేర్కొన్నారు.