NEWSNATIONAL

లిక్క‌ర్ స్కామ్ లో సీఎం కింగ్ పిన్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన స్మృతీ ఇరానీ

న్యూఢిల్లీ – కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. శ‌నివారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. త‌ను నిత్యం నీతి సూత్రాల‌తో జ‌నాన్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చార‌ని అన్నారు. కానీ ఈడీ రంగంలోకి దిగ‌డంతో అస‌లు వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయ‌ని అన్నారు.

ప్ర‌జ‌ల‌ను ఒక‌సారి మోసం చేయొచ్చు..రెండోసారి మోసం చేయొచ్చు..కానీ ఎళ్ల‌కాలం మో\సం చేయ‌లేర‌ని ఇప్ప‌టికైనా కేజ్రీవాల్ గ్ర‌హిస్తే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ఎవ‌రైనా, ఎంత‌టి వారైనా స‌రే చ‌ట్టానికి అతీతులు కార‌న్న విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని అన్నారు స్మృతీ ఇరానీ.

ఇప్ప‌టికే ఈడీ పూర్తి నివేదిక ఇచ్చింద‌న్నారు. తాను చేసిన త‌ప్పును క‌ప్పి పుచ్చుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, అందులో భాగంగానే త‌మ‌పై బుర‌ద చ‌ల్ల‌డం ప‌నిగా పెట్టుకున్నాడంటూ మండిప‌డ్డారు. ఏదో ఒక‌రోజు జైలులో ఉండాల్సిందేన‌ని అది ఇప్పుడు జ‌రిగింద‌న్నారు.

రాజ్యాంగ పదవిలో కూర్చుని నిజాయితీని ఉదహరిస్తూ తానేదో గొప్ప వ్య‌క్తిన‌ని ఫీల్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు.