సోషియో ఎకనామిక్ సర్వే వెల్లడి
అమరావతి – సోషియో ఎకనామిక్ సర్వే కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పేదరిక స్థాయిని అంచనా వేసింది. నివేదికను విడుదల చేసింది. పేదరికంలో రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉందని వెల్లడించింది. గిరిజన ప్రాంతాల్లోనే పేదరికం ఎక్కువగా ఉందని తెలిపింది.
అత్యధిక పేదరిక ఉమ్మడి జిల్లాగా కర్నూలు.. తర్వాతి స్థానాల్లో విజయనగరం, విశాఖ జిల్లాలు ఉన్నాయని పేర్కొంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తక్కువ పేదరికం ఉందని స్పష్టం చేసింది. పౌష్టికాహారంలో పదో స్థానంలో ఉండగా. శిశు మరణాల నివారణలో 11వ స్థానంలో ఉందని వెల్లడించింది.
పేదరిక నిర్మూలన కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సోషియో ఎకనామిక్ సర్వే ఏపీ కూటమి ప్రభుత్వానికి సూచించింది. ఇందుకోసం కీలకమైన కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా కొత్తగా కొలువు తీరిన కూటమి సర్కార్ పేదరిక నిర్మూలన కోసం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తన అంతిమ లక్ష్యం పేదరిక నిర్మూలనేనని పేర్కొన్నారు. కాగా ఆయన గత 40 ఏళ్లుగా పేదిరక నిర్మూలనే ధ్యేయం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు.