మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అమరావతి – మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనను అంతం చేయడంలో లోకేష్ పాత్ర కీలకమైందన్నారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్రతోనే టీడీపీకి పెద్ద ఎత్తున సీట్లు వచ్చాయని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ పేరును పరిశించాలని కోరారు సోమిరెడ్డి.
ఒకవేళ ఆనాడు లోకేష్ గనుక పాదయాత్ర చేయక పోయి ఉంటే ఇవాళ మనం అధికారంలో ఉండక పోయి ఉండేవారమన్నారు. సీఎం మరోసారి ఆలోచించకుండా వెంటనే ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ను చేయాలని కోరారు. లేకపోతే పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు.
తను విద్యాధికుడిగా, పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా అనుభవం సంపాదించాడని, అన్ని శాఖలపై మంచి పట్టుందన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ గుర్తింపు పొందారని, అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని, వెంటనే డిప్యూటీ సీఎంను చేయాలంటూ డిమాండ్ చేశారు. లేక పోతే ఇబ్బందులు తప్పవన్నారు.