Saturday, April 5, 2025
HomeNEWSవంశీ ఓ మృగం లాంటోడు - సోమిరెడ్డి

వంశీ ఓ మృగం లాంటోడు – సోమిరెడ్డి

మాజీ మంత్రి సంచ‌ల‌న కామెంట్స్

అమ‌రావ‌తి – మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్ట్ పై స్పందించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. వంశీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ను మృగం లాంటోడ‌ని మండిప‌డ్డారు. ఏ త‌ప్పు చేయ‌క పోతే ఓడి పోయిన వెంట‌నే దేశం విడిచి ఎందుకు వెళ్లి పోయాడ‌ని ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో మ‌రో నాలుగైదు మృగాలు ఉన్నాయ‌ని, వాళ్లు కూడా ఊచ‌లు లెక్క పెట్టాల్సిందేన‌ని హెచ్చ‌రించారు. వైసీపీలో టాప్ టూ బాట‌మ్ అంద‌రూ అలాగే త‌యార‌య్యారంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి వారిని స‌మ‌ర్థించిన జ‌గ‌న్ రెడ్డికి పార్టీ న‌డిపే అర్హ‌త లేద‌న్నారు.

గురువారం చంద్ర‌మోహ‌న్ రెడ్డి మాట్లాడారు. ఏ తప్పు చేయకపోతే మొదటి రౌండ్ ఫలితంతోనే ఎందుకు అక్క‌డ ఉండ‌కుండా పోయాడ‌ని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డిని మించిన చీటర్ లేరని అన్నారు. వల్లభనేని వంశీ లాంటి పశువు బయట ఉండ కూడదని, జైల్లో ఉండాలని ప్రజలందరూ కోరుకున్నారని చెప్పారు.

భారతదేశం నుంచి పారిపోయే ప్రయత్నం చేసి చివరకు జైలులో ఊచలు లెక్క బెడుతున్నాడ‌ని అన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన వ్యక్తి…వంశీ వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ప్రాణాలతో ఉండే వాడు కాద‌న్నారు.ఈ రోజు కూడా అరెస్టు తర్వాత రకరకాల నాటకాలకు తెరలేపాడని మండిప‌డ్డారు.

వల్లభనేని వంశీ చేసిన పాపాలు ఒకటి కాదు..రెండు కాదు…భాషకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఏం పీకుతాడని వాగాడన్నారు . లోకేష్ బాబు గురించి కూడా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చి పోయాడ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments