నిప్పులు చెరిగిన చంద్రమోహన్ రెడ్డి
అమరావతి – మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ భారం మోపారని ఆరోపించారు. జగన్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున దోచుకున్నారని అన్నారు. మెజారిటీ రాష్ట్రాలు విద్యుత్ మీటర్లు బిగించేందుకు ఒప్పుకోలేదని, కానీ మాజీ సీఎం లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సిగ్గు లేకుండా వైసీపీ శ్రేణులు ధర్నా చేయడం దారుణమన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. కానీ నిరాధారమైన ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. జనం జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
జగన్ చుట్టూ ఉండే రెడ్లు విచ్చలవిడిగా దోచుకున్నారంటూ ధ్వజమెత్తారు. మాజీ సీఎం స్మార్ట్ మీటర్ల పేరుతో నిలువునా దోపిడీకి పాల్పడ్డారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి. జగనన్న విద్యుత్ స్మార్ట్ మీటర్ ధర రూ.36,975 అంటూ ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో ఏపీని అప్పుల కుప్పగా మార్చేశాడని వాపోయారు. ప్రస్తుతం ఏపీ అప్పు రూ. 9.75 లక్షల కోట్లకు చేరుకుందన్నారు.