ENTERTAINMENT

స‌ల్మాన్ ఖాన్ కంటే లారెన్స్ బిష్ణోయ్ బెట‌ర్

Share it with your family & friends

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ గ‌ర్ల్ ఫ్రెండ్

ముంబై – ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు అత‌డి మాజీ ప్రియురాలు సోమీ అలీ. గురువారం దివాలీ పండుగ సంద‌ర్బంగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఇండియ‌న్ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ బెట‌ర్ అంటూ పేర్కొన్నారు సోమీ అలీ. త‌నను తీవ్రంగా వేధింపుల‌కు గురి చేశాడ‌ని వాపోయింది మాజీ ప్రియురాలు. అనేక సార్లు చాలా ఇబ్బందుల‌కు గురి చేశాడ‌ని ఆరోపించింది. తాను త‌ట్టుకోలేక పోయానంటూ పేర్కొంది.

ప‌లుమార్లు హ‌రాస్ మెంట్ కు గురైన‌ట్లు తెలిపింది. ఇదే స‌మ‌యంలో స‌ల్మాన్ ఖాన్ ను ప్రేమించిన పాపానికి చాలా మంది ఇక్క‌ట్ల పాల‌య్యార‌ని వెల్ల‌డించింది. ఇదే స‌మ‌యంలో ఆమె ప్ర‌త్యేకంగా ఐశ్వ‌ర్యా రాయ్ గురించి ప్ర‌స్తావించింది.

ఇదే స‌మ‌యంలో త‌ను చేసిన దాడితో ఐశ్వ‌ర్య రాయ్ భుజానికి గాయం కూడా అయ్యింద‌ని తెలిపింది. అంతే కాకుండా త‌న‌ను ప్రేమించిన పాపానికి క‌త్రీనా కైఫ్ క‌నిపించ‌కుండా పోయింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించింది సోమీ అలీ.

మొత్తంగా బాలీవుడ్ అగ్ర న‌టుడు స‌ల్మాన్ ఖాన్ కంటే గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ మంచి వ్య‌క్తి అని చెప్పింది. ప్ర‌స్తుతం సోమీ అలీ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి.