నార్వే యువరాణి కుమారుడు అరెస్ట్
అత్యాచారం చేశాడనే అనుమానం
డెన్మార్క్ – అత్యాచారానికి పాల్పడ్డాడనే అనుమానంతో నార్వే యువ రాణి కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ప్రిన్సెస్ మెట్టే , మారిట్ పెద్ద కుమారుడిని తిరిగి అదుపులోకి తీసుకున్నారు.
మారియస్ బోర్గ్ హోయిబీ నార్వేజియన్ సింహాసనానికి వారసుడు. అయితే ఆయనకు రాజ బిరుదు కానీ లేదా అధికారిక గౌరవం లేదు.
బోర్గ్ హాయిబీని ఓస్లోలో “స్పృహ కోల్పోయిన వ్యక్తితో లేదా ఇతర కారణాల వల్ల ఆ చర్యను అడ్డుకోలేని వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడనే” ప్రాథమిక ఆరోపణపై అరెస్టు చేశారు. ప్రాథమిక ఛార్జ్ అధికారిక ఛార్జ్ కంటే ముందు వస్తుంది . దర్యాప్తు సమయంలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడానికి అధికారులను అనుమతిస్తుంది.
ఆరోపించిన అత్యాచారం ఎప్పుడు జరిగిందో పోలీసులు చెప్పలేదు, కానీ “బాధితురాలు చర్యను ప్రతిఘటించ లేక పోయింది” అని మాత్రమే స్పష్టం చేశారు. నార్వేజియన్ మీడియా బోర్గ్ హోయిబీ ఆరోపణలను ఖండించింది.
అత్యాచారానికి గురైన మహిళ తరఫు న్యాయవాది హెగే సలోమన్ మాట్లాడుతూ ఆమె చాలా కష్టాల్లో ఉంది అని మాత్రమే స్పష్టం చేశారు. పోలీసులు కేసు పెట్టారని, అయితే బాధితురాలిని ఇంత వరకు గుర్తించ లేదని చెప్పారు. అనుమానితుడు, బాధితురాలి మధ్య బంధం ఉన్నట్లు తాము భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొనడం గమనార్హం.
బోర్గ్ హోయిబీపై పలు ఆరోపణలు ఉన్నాయి. అనేక నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించడం , చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటివి ఉన్నాయి. మొత్తం కేసుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
రాజకుటుంబాలు ఎక్కువగా ఉండే నార్వేలో ఈ కేసు ప్రముఖ వార్తగా నిలిచింది.