సోనియమ్మ చల్లంగ బతుకమ్మ
డిసెంబర్ 9న పుట్టిన రోజు
హైదరాబాద్ – సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజు ఇవాళ. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపింది.
అంతే కాకుండా సచివాలయంలో కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన వారు సోనియాకు బర్త్ డే విషెస్ తెలిపారు. సోనియా గాంధీ భారత దేశ రాజకీయాలలో కీలకమైన ముద్ర వేశారు. తన భర్త రాజీవ్ గాంధీని పోగొట్టుకున్నారు. ఇదే సమయంలో అత్త ఇందిరా గాంధీని కూడా పొట్టన పెట్టుకున్నారు.
ఆనాటి నుంచి ఇప్పటి దాకా ఎక్కడా పరిధులు దాటకుండానే కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటూ వస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. చివరకు ఒకానొక దశలో తన పౌరసత్వంపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నా బయట పడ్డారు. తన స్వస్థలం ఇటలీ అయినా..తను మాత్రం భారతీయురాలినేనంటూ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో బలిదానాలు, ఆత్మ త్యాగాలు, ఆత్మహత్యలను చూసి చలించి పోయింది. యూపీఏ హయాంలో తను కీలకమైన పాత్ర పోషించారు. చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఓకే చెప్పింది. ఆమెకు ఈ సందర్బంగా యావత్ నాలుగున్నర కోట్ల ప్రజానీకం రుణపడి ఉంది. ఆమె పది కాలాల పాటు బతకాలని కోరుకుందాం.