రాజ్యసభ ఎంపీగా సోనియా గాంధీ
ఏకగ్రీవంగా ఎన్నికైన సీపీపీ చైర్ పర్సన్
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనారోగ్యం కారణంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. రాజస్థాన్ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.
ఇదిలా ఉండగా రాజస్థాన్ లో మొత్తం 10 స్థానాలు ఉండగా ఇందులో ఆరుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కాగా భారతీయ జనతా పార్టీ నుంచి నలుగురు ఎన్నిక కావడం విశేషం. బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఎన్నికైనట్లు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ వెల్లడించారు.
ఇతర అభ్యర్థులు ఎవరూ పోటీలో లేక పోవడంతో ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనట్లు తెలిపారు. మరో వైపు రాజ్యసభ సభ్యులుగా ఉన్న మన్మోహన్ సింగ్ , భూపేంద్ర యాదవ్ ల పదవీ కాలం ఏప్రిల్ 3తో ముగుస్తుంది. ఇక బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా డిసెంబర్ లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్య సభ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది.