కళైంజ్ఞర్ కరుణానిధి గొప్ప నేత
సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ
తమిళనాడు – ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ సీఎం, దివంగత కళైంజ్ఞర్ కరుణానిధి జూన్ 3న సోమవారం 100వ జయంతి. ఈ సందర్భంగా డీఎంకేకు చెందిన సహచరులతో కలిసి కరుణానిధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సోనియా గాందీ.
కరుణానిధి అద్భుతమైన నాయకుడని కొనియాడారు. ఆయన అందించిన సలహాలు, సూచనలు తనను విస్తు గొలిపేలా చేశాయని పేర్కొన్నారు. ఆయనతో కలిసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చాలా సందర్బాలలో కలుసుకున్నట్లు చెప్పారు. ఆయన చాలా సార్లు కష్ట కాలంలో తనకు సాయంగా ఉన్నారని పేర్కొన్నారు సోనియా గాంధీ.
ఆయన చెప్పేది వింటూ, వివేకం, సలహాల వల్ల ప్రయోజనం పొందానని స్పష్టం చేశారు. కరుణానిధిని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.