ప్రమాదంలో భారత రాజ్యాంగం
ఆవేదన వ్యక్తం చేసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ – ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు సీపీపీ చైర్ పర్సన్ , మాజీ ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ. ఆదివారం భారత కూటమి ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
రోజు రోజుకు వ్యక్తిగత దాడులు , కక్ష సాధింపు ధోరణలు ఎక్కువై పోతున్నాయని వాపోయారు సోనియా గాంధీ. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు. అధికారం అన్నది శాశ్వతం కాదని, ఇవాళ మోదీ పీఎంగా ఉండవచ్చని కానీ రేపటి రోజున ప్రజలు తల్చుకుంటే మారి పోక తప్పదన్నారు.
ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం, కులం , మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్పితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏనాడైనా మోదీ సర్కార్ పరిష్కరించారా అని నిలదీశారు సోనియా గాంధీ. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ మోదీ జేబు సంస్థలుగా మారి పోయాయని సంచలన ఆరోపణలు చేశారు.
రాబోయే రోజుల్లో భారత కూటమికి విజయం తప్పదని, బీజేపీ ఓడిపోతుందని జోష్యం చెప్పారు.