మరింత బాధ్యత పెంచేలా చేసింది
సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ
న్యూఢిల్లీ – సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం లోక్ సభలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా తీవ్రంగా స్పందించారు. మీరంతా నాపై అపారమైన నమ్మకాన్ని ఉంచారని అన్నారు. మీరు ఈ పదేళ్ల కాలంలో ఎంతో బాధను అనుభవించారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కష్టాలను అధిగమించి విజయాలు సాధించారని కొనియాడారు సోనియా గాంధీ.
మీరందించిన బాధ్యతను నేను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని, ఇది మీరంతా మనస్పూర్తిగా అందించినందుకు సంతోషంగా ఉందన్నారు సీపీపీ చైర్ పర్సన్. ఈ సందర్బంగా కొత్తగా ఎన్నికైన లోక్ సభ ఎంపీలందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని స్పష్టం చేశారు సోనియా గాంధీ.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో పాటు ప్రతిపక్షాలతో కూడిన కూటమి సభ్యులకు కూడా కంగ్రాట్స్ తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనతో పాటు మీరందరూ కూడా ప్రజల పక్షాన తమ గొంతు వినిపించాలని పిలుపునిచ్చారు .