మోదీ అహంకారం ప్రమాదకరం
సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ
న్యూఢిల్లీ – సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె గతంలో ఎన్నడూ లేనంతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించారు. ఈ దేశంలో ఎవరైనా సరే దేశం కంటే ఎక్కువ కాదన్నారు. కానీ ప్రధాన మంత్రి తనను తాను గొప్పగా ఊహించు కుంటున్నారని, ఇది తనకు ప్రమాదకరమని గుర్తించాలన్నారు సోనియా గాంధీ.
ఇలా ఆలోచించే వారికి రాబోయే రోజుల్లో షాక్ తప్పదన్నారు. ప్రజలు మోదీని నమ్మే స్థితిలో లేరన్నారు . అయితే మోదీ లాంటి నాయకులు చాలా మంది పుట్టుకు వచ్చారని, మతం పేరుతో రాజకీయం చేయడం ప్రారంభించారని ఆరోపించారు. వీరంతా దేశాన్ని ఉద్దరిస్తున్నామని అనుకుంటున్నారని కానీ వారు ఎనలేని ద్రోహం దేశానికి, 143 కోట్ల మందికి చెడు తలపెడుతున్నారని ధ్వజమెత్తారు సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ.
విపక్ష నేతలను భయపెట్టి బీజేపీలో చేర్చుకునేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇవాళ భారత దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ అధికార ఆయుధంతో ప్రజాస్వామ్య సంస్థలు ధ్వంసమవుతున్నాయని వాపోయారు సోనియా గాంధీ. అంతే కాదు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని హెచ్చరించారు.