వినేష్ ఫోగట్ పతకానికి అర్హురాలు
మాజీ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ
కోల్ కతా – బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ పోటీలలో కేవలం 100 గ్రాముల బరువు ఉందన్న కారణంగా ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేయడాన్ని తప్పు పట్టారు.
ప్రధానంగా అంతర్జాతీయ ఒలింపిక్స్ ఎథిక్స్ కమిటీ రూల్స్ గురించి తనకు ప్రాథమిక తెలియదని అన్నారు. అయినా భారీ ఎత్తున బరువులో వ్యత్యాసం కనిపిస్తే చర్యలు తీసుకుంటే పర్వాలేదని, కానీ కేవలం వంద గ్రాములు ఉంటే ఎలా అనర్హురాలిగా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు సౌరవ్ గంగూలీ.
వినేష్ ఫోగట్ చివరి వరకు పోరాడిందని ప్రశంసించారు. ఇదే సమయంలో ఆమె కచ్చితంగా ఫైనల్ కు చేరుకుందని, ఏదో ఒక పతకం భారత్ కు వచ్చి ఉండేదన్నాడు. కనీసం రజత పతకానికైనా అర్హురాలని స్పష్టం చేశారు బీసీసీఐ మాజీ చీఫ్.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన వినేష్ ఫోగట్ కు మద్దతు పలకడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.