సభ్యుడిగా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్
దుబాయ్ – ఐసిసి పురుషుల క్రికెట్ కమిటీ చీఫ్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించారు బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. అక్టోబర్ 23, 2019 నుండి అక్టోబర్ 18, 2022 వరకు మూడేళ్ల పాటు చీఫ్ గా కొనసాగారు. బీసీసీఐకి కూడా అధ్యక్షుడిగా పని చేశాడు. వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్యానెల్ సభ్యులలో ఒకడిగా ఎంపికయ్యాడు. 2000 నుండి 2005 వరకు ఐదేళ్ల పాటు భారత జట్టుకు నాయకత్వం వహించాడు.
సౌరవ్ గంగూలీకి ఐసీసీ నుండి పదవి లభించడం ఇది రెండోసారి. 2021లో మొదటిసారి కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మూడేళ్ల పదవీకాలం తర్వాత ఆ పదవి నుంచి వైదొలిగిన సహచరుడు అనిల్ కుంబ్లే స్థానంలో భారత మాజీ కెప్టెన్ వచ్చారు.
సౌరవ్ గంగూలీ, లక్ష్మణ్‌లతో పాటు, మాజీ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ హమీద్ హసన్, వెస్టిండీస్ బ్యాటింగ్ గ్రేట్ డెస్మండ్ హేన్స్, దక్షిణాఫ్రికా టెస్ట్, వన్డే కెప్టెన్ టెంబా బావుమా, ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ జోనాథన్ ట్రాట్‌లను కమిటీలో నియమించారు. కొత్త ఐసిసి మహిళా క్రికెట్ కమిటీలో న్యూజిలాండ్ మాజీ ఆఫ్-స్పిన్నర్ కేథరీన్ కాంప్‌బెల్ చైర్‌పర్సన్‌గా, మాజీ ఆస్ట్రేలియా క్రీడాకారిణి అవ్రిల్ ఫాహే, క్రికెట్ దక్షిణాఫ్రికా (సిఎస్‌ఎ) ఫోలేట్సి మోసెకి ఇతర సభ్యులుగా ఉన్నారు.