Saturday, May 24, 2025
HomeDEVOTIONALభ‌క్తుల కోసం రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్లు

భ‌క్తుల కోసం రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్లు

మే 22 నుంచి జూలై 13 వ‌ర‌కు రిజ‌ర్వేష‌న్

హైద‌రాబాద్ – వేసవి లో తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఈ నెల 22వ తేదీ నుండి జూలై 13వ తేదీ వరకు మూడు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. యాత్రకి సంబందించిన వివరాలు వెల్లడించారు.

ప్యాకేజీ 1లో భాగంగా (దివ్య దక్షిణ యాత్ర తో జ్యోతిర్లింగం- SCZBG42) ఈ యాత్రలో అరుణాచలం / రామేశ్వరం / మధురై / కన్యాకుమారి / త్రివేండ్రం / తిరుచ్చి / తంజావూరు ప్రాంతాలు దర్శించవచ్చు. ఈ యాత్ర మే 22వ తేదీన ప్రారంభమై 30వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14700, 3 ఏసీ ధర 22900, 2 ఏసీ ధర 29900 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ ,భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.

ప్యాకేజీ 2: (గంగా రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర- SCZBG44) యాత్ర‌లో (కాశీ)వారణాసి / అయోధ్య / నైమిశారణ్య / ప్రయాగరాజ్ / శృంగవర్పూర్ ప్రాంతాలు దర్శించవచ్చు. ఈ యాత్ర జూన్ 14 వ తేదీన ప్రారంభమై 22 వ తేదీ వరకు ఉంట్టుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16200, 3 ఏసీ ధర 26500, 2 ఏసీ ధర 35000 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం,పలాస, బరంపూర్,భువనేశ్వర్ మీదుగావెళ్తుంది.

ప్యాకేజీ 3: (ఐదు జ్యోతిర్లింగ యాత్ర – SCZBG43 ఉజ్జయిని (మహాకాళేశ్వర్ – ఓంకారేశ్వర్) –త్రయంబకేశ్వర్ – భీమశంకర్ – ఘృష్ణేశ్వర్). ఈ యాత్రలో మహాకాళేశ్వర్ / ఓంకారేశ్వర్ /త్రయంబకేశ్వర్ / భీంశంకర్ / ఘృష్ణేశ్వర్ / ఎల్లోరా / మోవ్/ నాగ్పూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు. ఈ యాత్ర జూలై 05 వ తేదీన ప్రారంభమై 13 వ తేదీ వరకు ఉంట్టుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14700, 3 ఏసీ ధర 22900, 2 ఏసీ ధర 29900 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ ధర్మాబాద్ నాందేడ్ ముధ్ఖడ్ మరియు పూర్ణ మీదుగా వెళ్తుంది

సౌకర్యాలు: రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం), వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితం. ప్రతి రైలు లో 718 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సావకార్యాలు సమకురుస్తారు. కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701,9281030712,9281030749,9281030750,9281030740 లకు సంప్రదించాలని. మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రధించాలని తేలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments