టీటీడీకి కియోష్కి మిషన్ విరాళం
దాతలకు మరింత వెసులుబాటు
తిరుమల – సౌత్ ఇండియన్ బ్యాంకు తన ఉదారతను చాటుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు కియోస్క్ (క్యూఆర్) మిషన్ ను విరాళంగా ఇచ్చింది.
ఈ మిషన్ ను ప్రారంభించారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. దీనిని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేశారు. శ్రీవారి భక్తులు విరాళాలను నేరుగా దీని ద్వారా ఇచ్చేందుకు దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఏఈవో. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించు కోవాలని కోరారు.
ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళం ఇచ్చేందుకు వీలు కలుగుతుంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో రాజేంద్ర, సౌత్ ఇండియన్ బ్యాంకు జనరల్ మేనేజర్ టి.ఎం.మోహన్, ఏజీఎం వి.మధు, చీఫ్ మేనేజర్ వెంకట్ రావు, తిరుపతి బ్రాంచ్ హెడ్ అశోక్ వర్ధన్ పాల్గొన్నారు.