తెలంగాణలో ఎల్జీ..ఎల్ఎస్ గ్రూప్ ల విస్తరణ
సంతోషం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
దక్షిణ కొరియా – తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ కంపెనీలు ఎల్జీ , ఎల్ఎస్ సంస్థలు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రస్తుతం బిజీగా ఉంది. ఇప్పటికే సదరు టీమ్ అమెరికాలో పర్యటన ముగిసింది. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ కంపెనీలు ఒప్పందం కుదుర్చు కోవడంలో కీలక పాత్ర పోషించారు ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్.
తాజాగా యుఎస్ టూర్ సక్సెస్ అయ్యాక.. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన ఎల్ఎస్ గ్రూప్ (LS Group) చైర్మన్ కు-జాఉన్ (Koo Ja-eun) తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
ప్రపంచ ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్ (LG Group) వ్యవస్థాపకులైన LS Group కుటుంబాన్ని కలిశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా సంతోషం వ్యక్తం చేశారు.
ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడుల విస్తరణకు ఎల్ఎస్ గ్రూప్ (LS Group) ఆసక్తి కనబర్చింది. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఎల్ఎస్ గ్రూప్ (LS Group) ఉన్నత స్థాయి బృందం త్వరలోనే తెలంగాణను సందర్శించనుంది.