30 మందిని ఉరి తీశారని సమాచారం
ఉత్తర కొరియా – భారీ ఎత్తున వర్షాలు , వరదలు ఉత్తర కొరియాను ముంచెత్తాయి. ఎక్కడ చూసినా నీళ్లే. స్వయంగా దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ పర్యవేక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వరదల విధాన వైఫల్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా 30 మందికి ఉరి శిక్ష విధించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బుధవారం ఉత్తర ప్యోంగాన్ ప్రావిన్స్‌లో చైనా సరిహద్దుకు సమీపంలో వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. ఉత్తర కొరియా ప్రస్తుత పరిస్థితిని, అవసరాలను అంచనా వేస్తున్నట్లు అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది.
“మేము వరదల ప్రభావం గురించి చాలా ఆందోళన చెందుతున్నాం. పరిస్థితిని అంచనా వేయడానికి DPRK రెడ్‌క్రాస్ సొసైటీతో కలిసి పని చేస్తున్నాం” అని IFRC VOA తెలిపింది.
ఇదిలా ఉండగా స్వయంగా దేశ అధ్యక్షుడు వరద ప్రభావిత ప్రాంతాలలో సందర్శించడం , ఆగ్రహం వ్యక్తం చేయడం విస్తు పోయేలా చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మరాయి.