NEWSTELANGANA

కూతురుకు తండ్రి సెల్యూట్

Share it with your family & friends

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

హైద‌రాబాద్ – ట్రైనీ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఉమా హారతి సంచ‌ల‌నంగా మారారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉమా హార‌తి క‌ష్ట‌ప‌డి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో దేశ వ్యాప్తంగా వెల్ల‌డించిన ఫ‌లితాల‌లో స‌త్తా చాటింది. అత్యుత్త‌మ ర్యాంక్ ను సాధించింది. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది.

ఇదిలా ఉండ‌గా త‌న తండ్రి పోలీస్ ఉన్న‌తాధికారి. త‌ను ఎస్పీ క్యాడ‌ర్ తో స‌మాన‌మైన బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నాడు. తాజాగా అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. హైద‌రాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడ‌మీని ట్రైనీ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఎన్. ఉమా హార‌తి సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్బంగా త‌న కూతురును చూసిన వెంట‌నే టీజీపీఏ డిప్యూటీ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్న తండ్రి త‌న కూతురుకు సెల్యూట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా త‌ను దేశ వ్యాప్తంగా ప్ర‌క‌టించిన సివిల్స్ ర్యాంక్ ల‌లో ఏకంగా 3వ స్థానం సాధించింది. ఇలాంటి స‌న్నివేశం అరుదుగా క‌నిపిస్తుంది.