బహమాస్ దీవుల్లో పడి పోయిన శకలాలు
అమెరికా – ఎలోన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ రాకెట్ భూ కక్ష్య లోకి వెళ్లాల్సిన సమయంలో ఒక్కసారిగా పేలి పోయింది. అమెరికా లోని ఫ్లోరిడా, బహామాస్ దీవుల్లో పడి పోయాయి శకలాలు. ఈ ఘటనపై స్పేస్ ఎక్స్ స్పందించింది. రాకెట్ ఫెయిల్యూర్ పై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు నిర్మించిన రాకెట్ లలో ఇదే అత్యంత శక్తివంతమైనది కావడం విశేసం. రాకెట్ ప్రయోగించేందుకు నాలుగు డమ్మీ స్టార్ లింక్ ఉపగ్రహాలను మోహరించింది.
కాగా స్సేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ అంతరిక్షానికి చేరుకున్న తర్వాత పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు ఏడు రాకెట్లను ప్రయోగించింది. ఇది ఎనిమిదవది. రాకెట్ సామర్థ్యాలను పరీక్షించడం, నకిలీ ఉపగ్రహాలను మోహరించడం లక్ష్యంగా పెట్టుకుంది స్పేస్ ఎక్స్. ఈ స్టార్‌షిప్ రాకెట్ సబ్ ఆర్బిటాల్ విమానాన్ని నిర్వహించడానికి ఉద్దేశించబడింది, నాలుగు డమ్మీ స్టార్‌లింక్ ఉపగ్రహాలను మోహరించి, పునః ప్రవేశ విన్యాసాలను పరీక్షించింది.
ప్రొపెల్లెంట్ లైన్‌లకు సర్దుబాట్లు, అగ్ని ప్రమాదాలను తగ్గించడానికి వెంట్‌లను జోడించడం వంటి మునుపటి పరీక్ష నుండి సమస్యలను పరిష్కరించడానికి స్పేస్‌ఎక్స్ అనేక మార్పులను అమలు చేసింది. ఈ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, తాజా వైఫల్యం కంపెనీ తన ప్రతిష్టాత్మక స్టార్‌షిప్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేయడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేస్తుంది.