Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHఎక్స్ అఫీషియో స‌భ్యుడిగా స్పీక‌ర్

ఎక్స్ అఫీషియో స‌భ్యుడిగా స్పీక‌ర్

అయ్య‌న్న పాత్రుడు ప్ర‌మాణ స్వీకారం

అమ‌రావ‌తి – నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్మన్ తో పాటు కొంత మంది వైసిపి సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. ఈ సంద‌ర్బంగా మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మృతికి నివాళులు అర్పించారు. అత్యంత సాధార‌ణ జీవితం గ‌డిపారని, దేశాన్ని సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించార‌ని అన్నారు స్పీక‌ర్.

ఇద్దరు వైసిపి సభ్యులు కూటమికి మద్దతు ఇచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి, వైసిపి వైస్ చైర్మన్ గొలుసు నరసింహ మూర్తి సమావేశానికి హాజరయ్యారు. మున్సిపాలిటీలో కూటమి మెజార్టీ పెరిగిందని స్పీకర్ పేర్కొన్నారు.

తన ఎంపీ కాలంలో మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న సందర్భాలను గుర్తుచేశారు. మీటింగ్ నిర్వహణకు నోటీసు ఇచ్చిన తరువాత, రద్దు చేయడానికి తగిన కారణం ఉండాలని వ్యాఖ్యానించారు. కోరం ఉంటే చైర్మన్ లేకపోయినా మీటింగ్ నిర్వహించవచ్చని తెలిపారు. బడ్జెట్ ప్రకారం నిధులు వ్యయం చేయాలని సూచించారు. ఇష్టారాజ్యంగా రద్దు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

దీనిపై ప్రభుత్వానికి రిపోర్టు పంపించి తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిష‌న‌ర్ ను ఆదేశించారు చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments