హరీశ్ రావుపై స్పీకర్ సీరియస్
సీనియర్ అయి ఇలా ప్రవర్తిస్తారా
హైదరాబాద్ – మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు స్పీకర్ చురకలు అంటించారు. కేటీఆర్ పై పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ కార్ రేస్ పై సభలో చర్చ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
దీనిపై స్పీకర్ జోక్యం చేసుకుని ఒక సభ్యుని కోసం సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదన్నారు. సంబంధిత మంత్రి వచ్చాక మీ ప్రశ్నకు సమాధానం చెప్పిస్తానని, హరీష్ రావు ఇలా ప్రవర్తించడం సమంజసం కాదన్నారు స్పీకర్.
ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో అనుభవం కలిగిన వారు ఉన్నారని, కానీ ఇలా రూల్స్ కు విరుద్దంగా ప్రవర్తించడం మంచి పద్దతి కాదన్నారు. ప్రతి ఒక్కరికీ చెప్పుకునేందుకు, సమస్యలను ప్రస్తావించేందుకు తాను ఛాన్స్ ఇస్తున్నానని చెప్పారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
ఇదే సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సైతం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వారు కూడా కొంత అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో సభా సమయాన్ని సాధ్యమైనంత మేర సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇలాగే చేస్తే తాను ఊరుకోనని సుతిమెత్తగా హెచ్చరించారు.