వెల్లండించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. తిరుపతిలోని ప్రముఖ ఆలయమైన శ్రీ గోవింద రాజ స్వామి ఆలయంలో విశేష పర్వదినాలను జనవరి నెలకు సంబంధించి వెల్లడించింది. భక్తులు గమనించి దర్శించు కోవాలని , స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరింది.
జనవరి 5న శ్రీ గోవిందరాజస్వామివారు తీర్థకట్ట వేంచేపు , 6న శ్రీ ఆండాల్ అమ్మ వారి నీరాటోత్సవాలు ప్రారంభం అవుతాయి. 10న వైకుంఠ ఏకాదశి, 11న ముక్కోటి ఏకాదశి, 12న శ్రీ ఆండాల్ అమ్మ వారి నీరాటోత్సవాలు సమాప్తం అవుతాయి.
13న భోగి తేరు ఉత్సవం, 14న మకర సంక్రాంతి , 15న కనుమ పండుగ, గోదా పరిణయం, 16న కనుమ పార్వేట ఉత్సవం, 18న తిరుమోళిసాయి వర్ష తిరు నక్షత్రం, 20న కుర్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 28న అధ్యయనోత్సవాలు ప్రారంభం అవుతాయని టీటీడీ తెలిపింది.