మార్చి నెలకు సంబంధించి టీటీడీ వెల్లడి
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. మార్చి నెలకు సంబంధించి శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల గురించి తెలియ చేసింది. మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర, 9వ తేదీన తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది.
10వ తేదీన మతత్రయ ఏకాదశి. 13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి, 14న కుమార ధార తీర్థ ముక్కోటి, 25న సర్వ ఏకాదశి, 26న అన్నమాచార్య వర్థంతి, 28న మాస శివరాత్రి, 29న సర్వ అమావాస్య.
30న శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరుగుతుందని తెలిపారు ఈవో జె. శ్యామల రావు.
ఇదిలా ఉండగా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. భారీ ఎత్తున భక్తులు చేరుకున్నారు. ముందస్తుగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు ఈవో.