విజయవాడ మీదుగా వెసులుబాటు
విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే ప్రకటించింది. ఏపీకి చెందిన భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు యూపీలో మహా కుంభ మేళ నిర్వహించనున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 3 వేల రైళ్లు నడపనుంది రైల్వే శాఖ.
తిరుపతి-బెనారస్ (07107) ప్రత్యేక రైలు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో శనివారం రాత్రి 8.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు బెనారస్ చేరుకుంటుందని తిరుగు ప్రయాణంలో 07108 నంబరు రైలు జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24 తేదీల్లో బెనారస్‌లో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయలు దేరుతుందని వెల్లడించింది.
ఈ రైళ్లు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజ మహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగుడ తదితర స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.
అలాగే నర్సాపూర్-బెనారస్ (07109) ప్రత్యేక రైలు జనవరి 26, ఫిబ్రవరి 2 తేదీల్లో నర్సాపూర్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.45 గంటలకు బెనారస్ చేరుకుంటుందని,. తిరుగు ప్రయాణంలో జనవరి 27, ఫిబ్రవరి 3 తేదీల్లో 07110 నంబరు రైలు బెనారస్‌లో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుందని స్పష్టం చేసింది.