మతి పోగొడుతున్న శ్రీలీల
కిస్సిక్ స్పెషల్ సాంగ్ కేక
తమిళనాడు – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప -2 మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం గ్రాండ్ గా చెన్నైలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నటి శ్రీలీల.
సుకుమార్ తీసిన ప్రతి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండి తీరుతుంది. ఆర్య మూవీలో ఆ అంటే అమలాపురం..అన్న సాంగ్ ఊపేసింది. పుష్ప రాజ్ లో ఊ అంటావా అన్న సాంగ్ దుమ్ము రేపింది. ఇప్పుడు పుష్ప మూవీకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప-2 చిత్రంలో మరో స్పెషల్ పాట కెవ్వు కేక అనిపించేలా ఉంది.
భారీ రెమ్యూనరేషన్ తో శ్రీలీలను ఒప్పించినట్లు టాక్. అందుకు తగ్గట్టుగానే మూవీకి హైలెట్ గా నిలిచేలా ఈ సాంగ్ ను చిత్రీకరించారు దర్శకుడు సుకుమార్. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న నటీమణులలో శ్రీలీల ఒకరు. తను మహేష్ బాబు తో చేసిన సాంగ్ రికార్డ్ మోత మోగించింది. ఇప్పుడు నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక మందన్నాతో పోటీ పడుతోంది శ్రీలీల.
డ్యాన్స్ పరంగా ఇరగ దీసిందని అని చెప్పక తప్పదు. మూవీ రిలీజ్ అయ్యాక ఈ పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుందంటున్నారు ఫ్యాన్స్.